సోలార్ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే
కావలి పట్టణం ముసునూరులో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సౌమ్య సోలార్ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి బుధవారం పాల్గొన్నారు. సోలార్ ప్యానెల్స్ ను పరిశీలించారు. సోలార్ వాడకం వలన కరెంట్ బిల్లులు తగ్గించుకోవచ్చని, ప్రభుత్వ సబ్సిడీ లభిస్తుందని తెలిపారు. పర్యావరణానికి అనుకూలమైన సోలార్ వాడాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. షాపు యాజమాన్యం ఎమ్మెల్యే ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గుంటుపల్లి రాజ్ కుమార్ చౌదరి, ఉప్పుటూరి బాలగురు స్వామి, లింగం మాల్యాద్రి, బొట్లగుంట శ్రీహరి నాయుడు, బిట్రగుంట వెంకట్రావు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు..